21, డిసెంబర్ 2010, మంగళవారం

చిరుజల్లు

చుక్కలు కరిగి పుడమిని ముద్ధాడడానికి వస్తున్నాయీ...
తమలొని చైతన్య కాంతిని జీవ జ్యొతిగా మార్చి విత్తనాలకు ప్రాణం పోయడానికి పరిగెత్తుకు వస్తున్నాయీ..
వాడిపోయిన హ్రుదయాలపై సుగంధ పరిమలాలన్ని నింపడానికి వస్తున్నాయీ...
అలసిపోయిన మనసును లాలించడానికి అమ్మలా వస్తున్నాయీ...
మోడువారిన జీవితాలలొ చిగురాశను రేపె చెలియ చిరునవ్వులా వస్తున్నాయీ...
నాకోసం మబ్బులను చీల్చుకుంటూ  తన ప్రేమధారలలొ   తడిపేయడానికి వస్తున్నాయీ...              

18, డిసెంబర్ 2010, శనివారం

స్నేహమా నీకు జోహార్...!

నా ప్రతి అడుగులో తోడువై
నన్ను నడిపించింది నీవే
నా సంతోషాన్ని రెట్టింపు చేస్తూ
బాధలను పంచుకుంటూ
మరు క్షణంలో నవ్విస్తూ
అమ్మలా లాలిస్తూ
నాన్నలా శాసితూ
అమావాస్య చీకటిలో
పున్నమి వెన్నెలలు కురిపిస్తూ
జీవితపు ప్రతి మలుపులో
నన్ను వదిలిపోయావేమో అన్న భ్రమను
సరికొత్త రంగులతో
రెట్టించిన ప్రేమతో
సరికొత్త రూపంతో
దూరం చేస్తూ
నన్ను పరిపూర్ణం చేయడానికే
ఈ ఎడబాటు అని తెలియచేస్తూ
నాలో మమేకమై  నా ప్రపంచమంతా నీవై ఉన్న
స్నేహమా నీకు జోహార్...!



ఆశీర్వదించండి.

 నా మదిలో మెదిలే భావాలకు అక్షర రూపం కల్పించాలని చేస్తున్న చిరు ప్రయత్నం ఇది,పెద్దలు సలహాలు, సూచనల్తో ఆశీర్వచనాలను అందిస్తారని ఆశిస్తున్నాను.