18, డిసెంబర్ 2010, శనివారం

స్నేహమా నీకు జోహార్...!

నా ప్రతి అడుగులో తోడువై
నన్ను నడిపించింది నీవే
నా సంతోషాన్ని రెట్టింపు చేస్తూ
బాధలను పంచుకుంటూ
మరు క్షణంలో నవ్విస్తూ
అమ్మలా లాలిస్తూ
నాన్నలా శాసితూ
అమావాస్య చీకటిలో
పున్నమి వెన్నెలలు కురిపిస్తూ
జీవితపు ప్రతి మలుపులో
నన్ను వదిలిపోయావేమో అన్న భ్రమను
సరికొత్త రంగులతో
రెట్టించిన ప్రేమతో
సరికొత్త రూపంతో
దూరం చేస్తూ
నన్ను పరిపూర్ణం చేయడానికే
ఈ ఎడబాటు అని తెలియచేస్తూ
నాలో మమేకమై  నా ప్రపంచమంతా నీవై ఉన్న
స్నేహమా నీకు జోహార్...!



1 కామెంట్‌: